అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ సపోర్ట్‌.. బన్నీతో ఫోన్ లో మాట్లాడిన తారక్

అల్లు అర్జున్ అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్‌ 2 షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న తారక్.. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్.. అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

New Update
ntr (1)

అల్లు అర్జున్ అరెస్ట్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిన్న అరెస్ట్ అయిన బన్నీ.. నేటి ఉదయం మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను  పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా తరలివస్తున్నారు. 

Also Read :  ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

బన్నీకి తారక్ ఫోన్..

ఇప్పటికే దర్శక నిర్మాతలతో పాటూ పలువురు స్టార్ హీరోలు బన్నీ నివాసానికి చేరుకొని ఆయన్ని పరామర్శించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్‌ - 2 షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న తారక్..  అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ బన్నీకి తన సంఘీభావం తెలిపారు. తారక్ తో బన్నీ ఫోన్ లో సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ముంబై నుంచి హైదరాబాద్ రాగానే జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ను ఇంటికెళ్లి కలవనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు