CM Revanth Reddy : గురుకులాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బావున్నాయని అన్నారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు.. గురుకులాల విద్యార్థుల కంటే ఎక్కువనే భావన ఉందని చెప్పారు. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని అన్నారు. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావ హయాంలో తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇటీవలే గురుకులాల డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ... విద్యాసంస్థలకు ఉచిత కరెంట్.... ప్రభుత్వ విద్యాసంస్థలు ఒక్క రూపాయి కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. పేద వాళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరం... సీఎం రేవంత్ మాట్లాడుతూ.. "ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..?, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించాం. వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం." అని అన్నారు. Also read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు Also Read: తల్లి ప్రాణం తీసిన ఊయల.. మంచిర్యాలలో విషాదం