/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
ap rains
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వరుణుడు ఎంట్రీ ఇచ్చి భారీ వర్షాలతో హైదరాబాద్ సహా జిల్లాలను కుదిపేస్తున్నాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో.. రైతులకు భారీ నష్టం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!
క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయిపోతుంది. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కాగా.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read: IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ
ఏప్రిల్ 20 కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయి.
Also Read: AC Bills: ఏసీ వాడేప్పుడు ఇలా చేస్తే కరెంట్ బిల్లు వందల్లోనే వస్తుంది
Also Read: America:మాదారి మేం చూసుకుంటాం: అమెరికా!
telangana | khammam | mulugu | latest-news | weather | Telangana Weather | telangana weather report today | telangana weather news | telangana weather updates | telangana-weather-report | imd alert heavy rains to telangana | weather updates | telangana-weather-update | latest-telugu-news | latest telugu news updates