/rtv/media/media_files/2025/03/08/RdQUEcQKtSpKLWCIyKwx.jpg)
putin, zelensky, Trump
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే..ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికాప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని..ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ
తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి..కీవ్, అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా క్లిష్టమని అంగీకరించినప్పటికీ..వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Also Read: The Family Man Season 3: IPL తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'.. ఫ్యాన్స్ కు పండగే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ అధినేత పుతిన్ కు మధ్య ప్రస్తుతం ముందస్తు సమావేశాలు లేవని..కానీ అవసరం అయితే వెంటనే సమావేశమవుతామని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ ఘర్షణ విషయంలో ఐరోపా ఐరోపా దేశాలు ఉక్రెయిన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదని విమర్శించారు.సైనికీకరణ గురించి తప్ప ఆ దేశాల నుంచి ఎటువంటి శాంతి పిలుపులు లేవని అన్నారు.
కాగా పారిస్ లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నేతల నుంచి సానుకూల స్పందన వచ్చింది.ఈ నేపథ్యంలో వచ్చే వారం లండన్ లో మరో రౌండ్ చర్చలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ద విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు ఆ రెండు దేశాలు సహకరించడం లేదని తెలిపారు.ఘర్షణ ముగించేందుకు కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు విఫలమైనా,రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలో పురోగతి సాధించలేకపోయినా చర్చల ప్రక్రియ నుంచి అమెరికా వైదొలిగేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశారు. రష్యా,ఉక్రెయిన్ లలో ఏ దేశమైనా సరే ఏ ఒక్క కారణంతోనైనా శాంతి ప్రక్రియ నుంచి తప్పుకుంటే రెండు పక్షాలనూ తెలివి తక్కువ వారుగా ,మూర్ఖులుగా పరిగణిస్తామని శుక్రవారం శ్వేతసౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read: BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!
russia | america | ukrain | trump | america president trump | putin | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates