IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ...మోస్ట్ యంగెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఆల్ టైమ్. 14 ఏళ్ళకే ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సెలెక్ట్ అవడమే కాకుండా ఈరోజు తన మొదటి మ్యాచ్ ను కూడా ఆడాడు. మొదటి బాల్ కే సిక్స్ కొట్టి అదరహో అనిపించాడు.

author-image
By Manogna alamuru
New Update
ipl

Vaibhav Suryavanshi

ఐపీఎల్ మెగా వేలంలోనే సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఇతనినిరాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది . అప్పుడే వైభవ్ ురించి అందరూ మాట్లాడుకున్నారు. పెద్ద పద్ద ప్లేయర్లకు కూడా దక్కని ప్రైస్ వైభవ్ కు వెచ్చించి కొన్నారని చెప్పుున్నారు. కానీ ఐపీఎల్ మొదలైయ్యాక ఇతను ఒక్క మ్యాచ్ కడా ఆడలేదు. ఇప్పుడు ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయంతో ఆడకపోవడం...వైభవ్ కు కలిసి వచ్చింది. దాంతో అతను బరిలోకి దిగాడు. ఆర్ఆర్ తరుపున బ్యాట్ ను పట్టాడు.ఆ  విధంగా అతి పిన్న వయసులో కేవలం 14 ఏళ్ళ 23 రోజులకే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన క్రికెట్ గా చరిత్ర సృష్టించాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు వైభవ్. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సుగా మలిచాడు. మొత్తం మీద 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు.

14 ఏళ్ళ 23 రోజులకే..

2011లో బీహార్‌లోని తాజ్‌పుర్ లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు. 2008లో ఐపీఎల్ లో మొదలైన నాటికి వైభవ్ ఇంకా పుట్టనేలేదు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్‌ పట్టాడు. ఇతని కోసం అతని తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్‌లో రాణించిన వైభవ్.. పదేళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో.. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. దీంతో అండర్‌-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు.

 today-latest-news-in-telugu | IPL 2025 | vaibhav-suryavanshi | young | cricketer 

Also Read: LSG Vs RR: ఊరించి ఉసూరుమనిపించిన లఖ్‌నవూ.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే!

Advertisment
తాజా కథనాలు