/rtv/media/media_files/2025/04/19/cFhrrAnJTwOSkZEoAiof.jpg)
AC Bills
AC Bills: వేసవి రాగానే అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్ బిల్లులు మనందరినీ ఆందోళనలో పడేస్తాయి. ప్రత్యేకంగా ఏసీ వాడకం పెరిగిన తరుణంలో విద్యుత్ ఖర్చులు పెరగడం సహజం. కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడం వల్ల ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు. మొదటిగా ఎయిర్ కండిషనర్ ఉపయోగంలో లేనప్పుడు దాన్ని పూర్తిగా ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. రిమోట్‌తో ఆఫ్ చేసినా కూడా AC కంప్రెసర్ పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల అవసరములేనప్పుడు కూడా విద్యుత్ వినియోగం జరుగుతుంది. అందుకే ప్లగ్‌ని బయటకు తీయడం లేదా మేయిన్ ఆఫ్ చేయడం ఉత్తమమైది.
ఇలా చేయడం వల్ల విద్యుత్ వృథా తగ్గడమే కాకుండా AC పనితీరు కూడా మెరుగవుతుంది.
గదిలోకి వేడి గాలి ప్రవేశించకుండా..
ఇంకొక ముఖ్యమైన అంశం ఉష్ణోగ్రత సెట్టింగ్. చాలామందికి ACని తక్కువ డిగ్రీలకు సెట్ చేయడం గదిని త్వరగా చల్లబరిచేస్తుందని నమ్మకం. కానీ నిజానికి 24°C వద్ద ACను సెట్ చేస్తే శరీరానికి సౌకర్యవంతంగా ఉండటంతోపాటు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. AC వాడేటప్పుడు గది తలుపులు, కిటికీలు మూసివుండాలి. గదిలోకి వేడి గాలి ప్రవేశించకుండా ఉండటానికి మందపాటి కర్టెన్లు ఉపయోగించవచ్చు. దీనివల్ల గది వేడి కాకుండా ఉంటుంది. ACపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఫ్యాన్‌ను ఉపయోగించడం వల్ల గదిలో గాలి ప్రసరణ మెరుగవుతుంది. చల్లదనం సమానంగా వ్యాపిస్తుంది.
ఇది కూడా చదవండి: చేపలు కొనేటప్పుడు తాజాగా ఉన్నాయని ఎలా తెలుస్తుంది?
AC ఎక్కువగా పని చేయాల్సిన అవసరం ఉండదు. కొత్తగా AC కొన్నవారికి సాధారణంగా సర్వీసింగ్ అవసరం లేదని అనిపించొచ్చు. కానీ వాస్తవానికి దుమ్ము, కాలుష్యం కారణంగా యంత్రం పనితీరు తగ్గుతుంది. కనీసం ఏడాదిలో రెండు సార్లు సర్వీసింగ్ చేయడం ద్వారా యంత్రం శుభ్రంగా ఉండి సమర్థంగా పనిచేస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి, బిల్లులు తక్కువగా వస్తాయి. ఈ చిన్నచిన్న అలవాట్లు వేసవి కాలంలో విద్యుత్ బిల్లులపై భారం తగ్గించడంలో మీకు చాలా ఉపయోగపడతాయి. చల్లదనాన్ని అనుభవించడమే కాదు, ఖర్చులను కూడా సమర్థంగా నియంత్రించగలుగుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్టీల్ పాత్రలలో వండేప్పుడు ఈ తప్పులు చేయొద్దు
( latest-news | home-tips | home tips in telugu)