Heavy Rains: ఈ 15 జిల్లాల్లో అతి భారీ వర్షం.. అన్నీ శాఖలని సీఎం అప్రమత్తం
రాష్ట్రంలో 15 జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారనుంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది.