Landmine: పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసులు మృతి!
ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు.