Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణ వెదర్పై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయన్నారు. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వెదర్పై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయన్నారు. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
TG: మండే వేసవిలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బుధవారం, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈరోజు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. రేపు సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదైయ్యాయి.
TS: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వచ్చే రెండు మూడు రోజులూ తెలంగాణలో చలి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ రోజుల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగి అనంతరం సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని పేర్కొన్నది.
తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు వేడి..రాత్రంతా చలి గజగజ వణికిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.