HYD Rains: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
Highest Rainfall : హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. ఇవాళ కూడా భారీ వర్షాలు!
హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana rain alert: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.