/rtv/media/media_files/2025/07/09/youtube-2025-07-09-20-22-37.jpg)
Youtube
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం. తొలగించిన వాటిలో కేవలం చైనా 7,700 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు తెలిపింది. అవి భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ పలు కంటెంట్‌లను పోస్టు చేస్తున్నాయని ఆరోపించింది.
Also Read : ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి పవన్ భారీ సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
Google Removes 11,000 YouTube channels
Google removes nearly 11,000 YouTube channels linked to Chinese and Russian propaganda https://t.co/VPEsA0EP0w
— Financial Express (@FinancialXpress) July 22, 2025
Also Read : BIG BREAKING : మోదీ బిగ్ స్కెచ్.. ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి?
రష్యాకు చెందిన 2,000లకు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్‌సైట్లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. ఈ ఖాతాల్లో ఉక్రెయిన్, నాటోలను విమర్శిస్తూ.. రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల గూగుల్ 20 యూట్యూబ్ ఛానెల్‌లు, 4 ఖాతాలు, రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన ఓ బ్లాగును తొలగించినట్లు వివరించింది.
Also Read : 11వేల యూట్యూబ్ ఛానళ్లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ఎందుకంటే?
Also Read : వర్త్ వర్మా వర్త్.. 108MP కెమెరా, 22,000mAh బ్యాటరీతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్..
china | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest technology news in telugu | international news in telugu | ukraine | nato | Social Media