New Smartphone: వర్త్ వర్మా వర్త్.. 108MP కెమెరా, 22,000mAh బ్యాటరీతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్..

డుగీ ఎస్200 మ్యాక్స్ త్వరలో విడుదల కానుంది. 22,000mAh బ్యాటరీ, డ్యూయల్ డిస్‌ప్లేతో రాబోతుంది. 6.72 అంగుళాల FHD+ 120Hz ప్రధాన డిస్‌ప్లే, వెనుక 1.3-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. 108MP కెమెరా ఉండనున్నాయి.

New Update
Doogee S200 Max price

Doogee S200 Max

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డూగీ బ్రాండ్ త్వరలో తన ‘Doogee S200 Max’ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందు Doogee S200 Max స్పెసిఫికేషన్లు, ధర లీక్ అయింది. ఇది 6.72-అంగుళాల ఫుల్‌హెచ్‌డి + ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2400×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని లీక్‌లు చెబుతున్నాయి. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Doogee S200 Max Launching Soon

Doogee S200 Max ఫోన్ వెనుక వైపున 1.3-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 240×240 పిక్సెల్‌లతో వస్తుంది. ఇది పవర్-ఆఫ్ క్లాక్, యూట్యూబ్ ప్రివ్యూలు, యానిమేటెడ్ వాచ్ ఫేస్‌లు, యానిమేషన్ సిగ్నేచర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది.  అలాగే ఈ Doogee S200 Max ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68/IP69K, MIL-STD-810H సర్టిఫైడ్ బిల్డ్‌తో అమర్చబడి ఉంటుంది. 

ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, కస్టమైజ్ చేయగల హార్డ్‌వేర్ కీలు, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పైభాగంలో శక్తివంతమైన డ్యూయల్-LED ఫ్లాష్‌లైట్ ఉంటుంది. ఇది హై, లో, అల్ట్రాబ్రైట్, SOS, స్ట్రోబ్ వంటి ఐదు లైట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. MediaTek Dimensity 7050 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా అందించారు. దీంతో దీనిని స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఇది Android 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో వస్తుంది. S200 Max ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. దీనిలో 108MP శామ్‌సంగ్ ప్రధాన సెన్సార్, 20MP సోనీ నైట్ విజన్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంచారు. 

అయితే ఈ Doogee S200 Max  ఫోన్ అతిపెద్ద హైలైట్ దాని బ్యాటరీ. ఇది 66W సపోర్ట్‌తో 22,000mAh బ్యాటరీతో (Doogee S200 Max battery) వస్తుంది. దీనికి 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. డూగీ S200 మ్యాక్స్ ధర $559.99గా (రూ.48,379) (Doogee S200 Max price)గా ఉన్నట్లు అంచనా.  ఈ ఫోన్ గ్రే, గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 

mobile-offers | new-smartphone

Advertisment
తాజా కథనాలు