Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అంతేకాదు జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వీరందరూ విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఓ కంపెనీలో కార్మికులను తెలుస్తోంది.
ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తి 17 ఏళ్ళ బాలుడిగా గుర్తించారు.