BIG BREAKING : మోదీ బిగ్ స్కెచ్..  ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి?

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తెరపైకి కొంతమంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.  నితీష్‌ను ఢిల్లీ పంపి బీహార్‌ అసెంబ్లీని చేజింక్కించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

New Update
chiranjeevi

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా, ఆమె దానిని ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027 ఆగస్టు వరకు ఉంది. అయితే, మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read :  బిగ్ న్యూస్.. తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు!

లిస్టులో ఉన్నది వీళ్లే! 

అయితే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తెరపైకి కొంతమంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.  నితీష్‌ను ఢిల్లీ పంపి బీహార్‌ అసెంబ్లీని చేజింక్కించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.  బీహార్ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా యూపీ నుంచి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు, సౌత్ నుంచి ప్రధానంగా కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇదే లిస్టులో మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవి పేరు ప్రచారం కూడా జరుగుతోంది.  జనసేన బీజేపీలో భాగంగా ఉండటం, పవన్ కల్యాణ్ క్రేజ్ ను సౌత్ అంతా వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.  

Also Read :  గుట్కాలు బంజేయండి .. ఫిష్ వెంకట్ షాకింగ్ మెసేజ్!

కేంద్ర మంత్రిగా పనిచేశాక రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్నారు. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.  ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు చిరు.  లైనప్ లో మరికొన్ని సినిమాలున్నాయి.  ఈ క్రమంలో చిరు ఉపరాష్ట్రపతి ఆఫర్ కు ఓకే చెబుతారా అంటే వేచి చూడాల్సిందే.  రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.   

Also read :  Rape Complaint : రేప్ చేశాడని కేసు పెట్టిన యువతికి దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు!

Also Read :  మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

pm modi | chiranjeevi | india | vice-president

Advertisment
తాజా కథనాలు