🔴India-Pakistan War Live Updates: పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ..

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శనివారం BSF సిబ్బంది ఒక పాకిస్తానీ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Lok Prakash
New Update
India-Pakistan War

India-Pakistan War

🔴India-Pakistan War Live Updates:

BIG BREAKING: పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ.. ఎక్కడంటే?

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శనివారం BSF సిబ్బంది ఒక పాకిస్తానీ(Pakistan) రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. సమీప ప్రాంతాలలో గూఢచర్యం చేస్తుండగా బహవల్‌పూర్ సెక్టార్ నుండి BSF అతడిని అరెస్ట్ చేసింది.

Pakistani Ranger

ఇండియా ఆంక్షలు విధించింనా పాకిస్తాన్‌ బుద్ధి మార్చుకోవడం లేదు. బార్డర్‌ దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ రేంజర్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఫోర్ట్ అబ్బాస్ వద్ద సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన పాక్‌ రేంజర్‌ BSF సిబ్బంది అరెస్ట్ చేసింది. భారత్‌లోకి చొరబడిన పాక్ రేంజర్ క్వాజా మీర్‌  కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా బార్డర్‌ దాటినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను తెలుసుకునేందుకే సరిహద్దు దాటాడు. 

Also Read: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

Also Read: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

 

Also Read: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

గత వారం రోజుల క్రితం ఒక BSF కానిస్టేబుల్‌ని పాకిస్తాన్ కస్టడీలోకి తీసుకుంది. అతన్ని ఇంకా విడుదల చేయలేదు. వివరాలు కూడా వెల్లడించలేదు.

గత బుధవారం అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను అదుపులోకి తీసుకున్నారు. అతనిని సురక్షితంగా విడుదల చేయడానికి ఎనిమిది రోజులకు పైగా అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. అవి ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.

  • May 04, 2025 21:29 IST

    పాకిస్తాన్‌కి రాజ్‌నాథ్ సింగ్ మరో స్ట్రాంగ్ వార్నింగ్

    కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌కు మరో వార్నింగ్ ఇచ్చారు. దేశంపై దాడి చేసినాళ్లకి గట్టి సమాధానం చెబుతామన్నారు. చైనాతో కలిసి ఇండియాతో కుట్రకు పాల్పడేవాళ్లకు ఊహించని విధంగా బదులిస్తామన్నారు.

    Defence Minister Rajnath Singh
    Defence Minister Rajnath Singh



  • May 04, 2025 19:40 IST

    పాకిస్థాన్‌ను ఏకాకి చేసిన ముస్లిం దేశాలు..

    పాకిస్థాన్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ముస్లిం దేశాలు పాక్‌ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి.

    Muslim Countries Not Supporting to Pakistan amid India-Pak Tensions
    Muslim Countries Not Supporting to Pakistan amid India-Pak Tensions

     



  • May 04, 2025 18:51 IST

    ఇండియా అష్టదిగ్భందంలో దాయాది పాకిస్తాన్



  • May 04, 2025 18:49 IST

    J&K: Latest Visuals From Ramban



  • May 04, 2025 18:43 IST

    భారత్‌తో ఘర్షణ జరగొచ్చు.. పాక్‌ రక్షణ మంత్రి సంచలన ప్రకటన

    పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్‌ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

    Pakistan Defense Minister Khawaja Asif key Comments on Indian Navy
    Pakistan Defense Minister Khawaja Asif key Comments on Indian Navy

     



  • May 04, 2025 14:37 IST

    జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి

    జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ ఘటన జరిగింది.

    Jammu Kashmir Army Vehicle Falls Into Gorge 3 Soldiers Killed
    Jammu Kashmir Army Vehicle Falls Into Gorge 3 Soldiers Killed Photograph: (Jammu Kashmir Army Vehicle Falls Into Gorge 3 Soldiers Killed)

     



  • May 04, 2025 13:59 IST

    Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...

    జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది.

    CM Omar Abdullah meets Prime Minister Modi.
    CM Omar Abdullah meets Prime Minister Modi.

     



  • May 04, 2025 11:24 IST

    రాత్రికి రాత్రే.. పాక్‌ పార్లమెంట్ స్పెషల్ మీటింగ్ పెట్టిన ప్రెసిడెంట్

    పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారి పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నోటీసులు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఆదివారం (ఈరోజు) సాయంత్రం 5గంటలకు భేటీ కానుంది. 

    pak emergency meeting



  • May 04, 2025 09:58 IST

    Flash News: ఇండియా ప్లాన్ లీక్.. పాకిస్తాన్ రాయబారి సంచలన కామెంట్స్

    రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలనుకుంటుందని కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసిందన్నారు రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ. గొడవ స్టార్ట్ అయ్యింది.. భారత్‌కు అణ్వాయుధాలతో సమాధానం చెబుతామన్నారు.

    Pakistan ambassador



  • May 04, 2025 09:29 IST

    Pahalgam Attack : ప్రతికార చర్య తప్పదు...అమెరికాకు స్పష్టం చేసిన భారత్..మే 9లోపే అంతా ముగిస్తాం

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. వరుసగా అధికార వర్గాలతో మోదీ..భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది. కాగా రెండు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సూచించింది. అయితే పహల్గాం దాడికి ప్రతికార చర్యతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

    Retaliatory action is inevitable
    Retaliatory action is inevitable

     



  • May 04, 2025 08:08 IST

    BREAKING: బరితెగించిన పాక్ సైన్యం ఈరోజు కూడా..!

    జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాలలో పాకిస్తాన్ దళాలు వరుసగా 10వ రోజు రాత్రి కూడా LOC వెంట కాల్పులు జరిపాయి.  

    violates ceasefire



  • May 04, 2025 07:20 IST

    Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?

    పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. వాళ్లని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Pahalgam attack
    Pahalgam attack

     



  • May 04, 2025 07:19 IST

    KA Paul: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం‌లో జరిగిన టెర్రర్ అటాక్‌పై కే ఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం తనకు ఇస్తే లీడర్‌షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పుకొచ్చారు.

    ka paul pahalgam



  • May 04, 2025 07:19 IST

    Economic Crisis: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

    పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆర్థిక సంక్షోభం వేళ ప్రజల దృష్టి మార్చేందుకే పహల్గాం దాడికి పాల్పడిందనే అనే అనుమానాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Pakistan Economic Crisis
    Pakistan Economic Crisis

     



  • May 04, 2025 07:18 IST

    Pakistan: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్

    భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ.. 450 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లే సర్ఫేస్‌ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది.

    Pakistan claims it successfully test fired 450 km range Abdali missile amid heightened tensions with India
    Pakistan claims it successfully test fired 450 km range Abdali missile amid heightened tensions with India

     



Advertisment
Advertisment
తాజా కథనాలు