/rtv/media/media_files/2025/05/03/nJIt2UnXxSTQcCSd5GIu.jpg)
Pakistan claims it successfully test fired 450 km range Abdali missile amid heightened tensions with India
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్.. 450 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లే సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ తాజాగా ప్రకటించింది. విజయవంతంగా తాము అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణి ప్రయోగం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం : పాక్
India - Pakistan High Tension
भारत की तरफ़ से हमले की आशंका से पीड़ित पाकिस्तान ने 450km रेंज के सतह से सतह पर मार करने वाली अब्दाली मिसाइल का टेस्ट फ़ायर किया pic.twitter.com/S2a2zf5Qu1
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) May 3, 2025
Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్
పాకిస్థాన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క్షిపణి పనితీరును పరిశీలించేందుకు, సాంకేతిక లక్షణాలను ధృవీకరించేందుకు, అలాగే మిసైల్ ఆధునిక నావిగేషన్ వ్యవస్థను అంచనా వేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. 'ఎక్సర్సైజ్ ఇండస్'లో భాగంగా ఈ మిసైల్ టెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్మీ స్ట్రాటజిస్ట్ ఫోర్సెస్ కమాండ్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ అండ్ ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అధికారులు, శాస్త్రవేత్తలు ఈ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు.
Also Read: తెలంగాణలో 800 ఏళ్ల కాలం నాటి పురాతన వస్తువులు గుర్తింపు.. ఏంటంటే ?
ఇప్పటికే పాక్ తో సింధూ జలాలతో(Indus River) పాటుగా దౌత్య సంబంధాలను తెంచుకున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ నుండి రవాణా చేయబడిన అన్ని ఉత్పత్తులకు వర్తిస్తుందనిఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో విదేశీ వాణిజ్య విధానం (FTP) 2023 కు కొత్త నిబంధన జోడించబడింది.
Also Read : అఘోరీని జైల్లో కలిసిన ఫ్యామిలీ.. ఎవడ్నీ వదలనంటూ తండ్రి మాస్ వార్నింగ్!
india-pakistan | big twist in india pakistan war | international news in telugu | national news in Telugu | breaking news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu