/rtv/media/media_files/2025/05/04/RdYCtYgpLiXOE6nWRSLh.jpg)
ఇండియా మాపై దాడి చేయాలని చూస్తోందని.. వాటికి సంబంధించిన ప్లాన్ అంతా లీక్ అయినట్లు పాకిస్తాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ ఓ టీవీ ఇంటర్వ్వూలో ఆరోపించాడు. పాకిస్తాన్ అణ్వాయుధాలతో దాడి చేస్తోందని ఆయన హెచ్చరించారు. రష్యాలోని పాకిస్తాన్ రాయబారి ఇండియాకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ చేతికి కొన్ని డాక్యుమెంట్స్ చిక్కాయి. వాటిని బట్టి చూస్తే ఇండియా పాకిస్తాన్‌లో కొన్ని చోట్ల దాడులు చేయాలనుకుంటుందని రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ సంచలన ఆరోపణలు చేశారు. గొడవ స్టార్ట్ అయ్యింది.. ఇక చూస్తోండి పాకిస్తాన్ భారత్‌కు సంప్రదాయ, అణ్వాయుధాలతో సమాధానం చెబుతుందని అన్నారు.
🚨 NUCLEAR warning from Pakistan to India
— Naren Mukherjee (@NMukherjee6) May 4, 2025
‘Pakistan will use full spectrum of power, both conventional and NUCLEAR’ — Ambassador to Russia Mhd Khalid Jamali tells RT news agency 😨😡🤔👇 pic.twitter.com/QvfY5hAxxa
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇండియా ఇప్పటికే పాక్ పై పలు ఆంక్షలు పెట్టి అష్టదిగ్భందంలో పడేసింది. ఆంక్షలతో పాక్ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దౌత్య వ్యూహానికి పాక్ ప్రభుత్వం విలవిలబోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కు రెండే ఆప్షన్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకటి ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడం, రెండు ఇండియాతో నేరుగా యుద్ధానికి దిగడం. యుద్ధమైనా చేస్తాం కానీ ఉగ్రవాదులను రక్షించడం మానుకోమని పాక్ గట్టిగా చెబుతుంది. ఈక్రమంలోనే POKలో యువకులకు ట్రైనింగ్ క్యాంప్స్ ప్రారంభించింది.
భారత దేశంలో మీడియా ఆ దేశంలో నుంచి చేసిన రెచ్చగొట్టే ప్రకటనలే మమ్మల్ని యుద్ధవైపు నడుపుతున్నాయని జమాలీ అన్నారు. గతకొన్ని రోజుల ముందు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి కూడా భారతదేశంపై అణ్వాయుధాలతో ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఆయుధాగారం- ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణులతోపాటు130 అణ్వాయుధాలు ఇండియా వైపు ఎక్కుపెట్టి ఉన్నాయని అన్నారు.
(Pakistan ambassador | russia | nuclear attack | india | pakistan | latest-telugu-news | india pak war )