BREAKING: బరితెగించిన పాక్ సైన్యం ఈరోజు కూడా..!

జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాలలో పాకిస్తాన్ దళాలు వరుసగా 10వ రోజు రాత్రి కూడా LOC వెంట కాల్పులు జరిపాయి.  

New Update
violates ceasefire

ఇండియా, పాక్ సరిహద్దులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. వరుసగా జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాలలో పాకిస్తాన్ దళాలు వరుసగా 10వ రోజు రాత్రి కూడా LOC వెంట కాల్పులు జరిపాయి.  

Also read: BIG BREAKING: పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ.. ఎక్కడంటే?

కాల్పుల విరమణ ఉల్లంఘన కొనసాగిస్తూ ఇండియన్ ఆర్మీ పోస్టులపై ఫైరింగ్ చేశాయి. దీనికి భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తోంది. దామాషా పద్ధతిలో మనవాళ్లు కూడా బదులు ఇస్తున్నారు. ప్రతిస్పందించింది. శనివారం రాత్రి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఎల్‌ఓసి అంతటా ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు తెగబడ్డాయని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఈ సరిహద్దు ఘర్షణల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. శుక్రవారం రాత్రి కూడా నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టులపై కాల్పులు చేశారు.

Also read: కన్నీళ్లు పెట్టించే మరో గోట్ లైఫ్ స్టోరీ.. రెడ్డి నాయక్ కోసం రంగంలోకి KTR టీం

(pakistan | Indian Army | firing | india pak war | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు