/rtv/media/media_files/2025/05/04/ZbHhB16oWZ8UzTBwv1JG.jpg)
Retaliatory action is inevitable
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ ల మధ్య ఉద్రక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే భారత్ యుద్ధం మాటెత్తకపోయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోంది. సరిహద్దుల వెంట నిత్యం కాల్పులకు పాల్పడుతోంది. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతొ భారత సైనికులు ప్రతీకార చర్యకు ఉపక్రమిస్తున్నారని తెలుస్తుంది. వరుసగా అధికార వర్గాలతో మోదీ.. భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది. కాగా రెండు దేశాలు సంయమనం పాటించాలని అగ్రదేశం అమెరికా సూచించింది. అయితే ఈ విషయంలో భారతదేశం స్పష్టమైన వైఖరిని వెల్లడించినట్లు తెలిసింది. పహల్గాం దాడికి ప్రతికార చర్యతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఇక ఈ దాడి కూడా ఎప్పుడు ఉండనుంది అంటే మే 9 లోపేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు సూటిగా మోదీ వార్నింగ్ ఇవ్వడం దీనికి బలం చేకూర్చుతోంది. ఈ నెల 9న జరగనున్న రష్యా విక్టరీ పరేడ్‌కు మోదీ, రాజ్‌నాథ్ సహా భారత్ అగ్ర నేతలు ఎవ్వరూ వెళ్లడం లేదు. రష్యా టూర్ రద్దు చేసుకుని మరీ మోదీ అదే కసరత్తులో ఉన్నారు. భద్రత, యాక్షన్ ప్లాన్‌పై మోదీ, రాజ్‌నాథ్ నేరుగా సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక త్రివిధ దళాల అధిపతులతో కూడా కీలక సమావేశాలు పూర్తయ్యాయి. దేశవిదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు పూర్తయ్యాయి. అయితే సైనిక చర్యకు దిగుతుందా లేక ఉగ్రవాదులకు ఏరివేతకు గతంలో లాగా సర్టికల్ స్ర్టైక్స్ చేస్తుందా అనేది మాత్రం స్పష్టం కాలేదు. కానీ 9లోపు పాకిస్థాన్ కు గట్టి బుద్ది చెప్పాలని ప్రధాని భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
మరోవైపు అరెబియా మహాసముద్రంలో నావికాదళాన్ని మోహరించిన విషయమై ఉన్నతాధికారులతో మోడీ సమావేశమయ్యారు. అలాగే అన్ని అణు రియాక్టర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకా దళ సన్నద్ధతపై చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీతో జమ్ముకశ్మీర్ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఆయనకు ఇది తొలి సమావేశం కావడం గమనార్హం.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!