Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

హైదరాబాద్ లో 15 సంవత్సరాలు దాటిన 2 వేలు 500 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. నగరంలోని ప్రతి ఎనిమిది విద్యా సంస్థల బస్సులలో సుమారు ఒకటి 15 సంవత్సరాలు దాటిందని, అలాంటివి దాదాపు 2,500 బస్సులు  ఇప్పటికీ నడుస్తున్నాయని డేటా వెల్లడిస్తోంది.

New Update
rta buses Hyderabad

rta buses Hyderabad

Hyderabad School Buses: హైదరాబాద్ లో 15 సంవత్సరాలు దాటిన 2 వేలు 500 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. నగరంలోని ప్రతి ఎనిమిది విద్యా సంస్థల బస్సులలో సుమారు ఒకటి 15 సంవత్సరాలు దాటిందని, అలాంటివి దాదాపు 2,500 బస్సులు  ఇప్పటికీ నడుస్తున్నాయని డేటా వెల్లడిస్తోంది. మొత్తం విద్యా సంస్థల బస్సుల సంఖ్య 31,000 కాగా, వీటిలో దాదాపు 20,000 హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

గత తొమ్మిది నెలల్లో నగరంలో విద్యా సంస్థల బస్సుల వలన ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో  ఐదుగురు విద్యార్థులు మరణించగా..  38 మంది గాయపడ్డారు. సాధారణంగా RTA తీవ్రమైన సంఘటనలు జరిగిన తర్వాత మాత్రమే చర్య తీసుకుంటుంది కానీ ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.  ఫిట్‌నెస్ ప్రమాణాలు సరిపోకపోవడం, ఓవర్‌లోడింగ్, రోడ్డుపై డ్రైవర్లు ప్రోటోకాల్‌లు పాటించకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  

Also Read :  Hyderabad: జూబ్లీహిల్స్‌లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు

మే 15 నుండి ఫిట్‌నెస్ పరీక్షలు

స్కూల్, కాలేజీ వాహనాలకు మే 15 నుండి ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిట్‌నెస్‌ విషయంలోనూ 15 ఏళ్లు దాటిన బస్సులపై పూర్తిగా కఠినంగా వ్యవహరించడంతో పాటు నిశితంగా పరిశీలిస్తున్నామని RTA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలు పొందడానికి నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మోటారు వాహనాల (MV) నిబంధనల ప్రకారం..  విద్యార్థులను పరిమితికి మించి తీసుకవెళ్లరాదు..  బస్సుకు అద్దాలు ఉండాలి.. ఎమర్జెన్సీ డోర్‌ తప్పనిసరిగా ఉండాలి.  సరిపడా మందులతో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉండాలి,   బస్సుకు సైడీ రెయిలింగ్‌ అవసరం...బస్సులో నిలువు రాడ్లు ఉండాలి . RTA జారీ చేసిన వారి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల వార్షిక పునరుద్ధరణ చేయించుకోవాల్సి ఉంటుంది.  

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Also Read : Hyderabad : సమ్మర్ ఎఫెక్ట్..  హైదరాబాద్లో 60 శాతం పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు

hyderabad | school-bus | Regional Transport Authority | telangana | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు