BIG BREAKING: పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ.. ఎక్కడంటే?

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శనివారం BSF సిబ్బంది ఒక పాకిస్తానీ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. సమీప ప్రాంతాలలో గూఢచర్యం చేస్తుండగా బహవల్‌పూర్ సెక్టార్ నుండి BSF అతడిని అరెస్ట్ చేసింది.

New Update
Pakistani Ranger

ఇండియా ఆంక్షలు విధించింనా పాకిస్తాన్‌ బుద్ధి మార్చుకోవడం లేదు. బార్డర్‌ దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ రేంజర్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఫోర్ట్ అబ్బాస్ వద్ద సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన పాక్‌ రేంజర్‌ BSF సిబ్బంది అరెస్ట్ చేసింది. భారత్‌లోకి చొరబడిన పాక్ రేంజర్ క్వాజా మీర్‌  కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా బార్డర్‌ దాటినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ యుద్ధ ప్రయత్నాలను తెలుసుకునేందుకే సరిహద్దు దాటాడు. 

Also read: కన్నీళ్లు పెట్టించే మరో గోట్ లైఫ్ స్టోరీ.. రెడ్డి నాయక్ కోసం రంగంలోకి KTR టీం

గత వారం రోజుల క్రితం ఒక BSF కానిస్టేబుల్‌ని పాకిస్తాన్ కస్టడీలోకి తీసుకుంది. అతన్ని ఇంకా విడుదల చేయలేదు. వివరాలు కూడా వెల్లడించలేదు.

Also Read: మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!

గత బుధవారం అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను అదుపులోకి తీసుకున్నారు. అతనిని సురక్షితంగా విడుదల చేయడానికి ఎనిమిది రోజులకు పైగా అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. అవి ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.

(Pakistanis | pakisthan | Indian Army | latest-telugu-news | india pak war)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు