/rtv/media/media_files/2025/05/03/yEU6mScZPE4IZQR0juij.jpg)
Pakistan Economic Crisis
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణామైన ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగొచ్చనే ప్రచారం నడుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఘటనపై పాకిస్థాన్ ఏమాత్రం సానుభూతి చూపించడం లేదు. పైగా భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. ద్రవోల్బణం పెరిగిపోయింది. నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు రోజులు వెల్లదీసేందుకే కొట్టుమిట్టాడుతున్నారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు యుద్ధం చేసేందుకు వెనకాడమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ప్రజల వ్యతిరేకతను తప్పుదారి పట్టించేందుకే దాయది దేశం భారత్‌లో దాడులు చేసిందా అని పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అరటిపండే కాదు.. దాని తొక్కతోనూ బోలెడు ప్రయోజనాలు
క్షీణించిన విదేశీ మారక నిల్వలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా ప్రభావం, ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, సరిహద్దుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లాంటి అంశాలు ఆర్థిక మందగమనానికి దారి తీశాయి. 2023లో విదేశీ మారక నిల్వలు పాకిస్థాన్‌లో క్షీణించిపోయింది. ద్రవ్యోల్బణం 38 శాతానికి పెరిగింది. వడ్డీ రెట్లు 22 శాతం దాటిపోయాయి. దీంతో ఆ దేశం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిరంతరం నిధులు సమకూర్చడం వల్లే ఆ దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF), సౌదీ అరేబియా, యూఏఈ, చైనా వంటి దేశాల నుంచి పాక్‌కు తాత్కాలిక సాయం లభించినప్పటికీ.. ఆ దేశ ఆర్థి పరిస్థితి మాత్రం ఇప్పటికీ మెరుగుపడలేదు. ఇటీవల IMFతో కొత్త రుణం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. 2025 నాటికి పాక్ 22 బిలియన్ డాలర్ల రుణం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రపంచ బ్యాంకు కూడా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది.
దారుణంగా పడిపోయిన కరెన్సీ
ప్రస్తుతం పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా దారుణంగా దిగజారిపోయింది. 1 డాలర్ విలువ ఏకంగా 281 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు వచ్చేశాయి. బియ్యం, పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి సగటు పాకిస్థాన్ పౌరుడికి అందుబాటులే లేకుండా పోయాయి. లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో కిలో బియ్యం ధర దాదాపు రూ.340 ఉంది. కిలో చికెన్ ధర ఏకంగా రూ.800లకు ఎగబాకింది.
గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, గుడ్ల ధర డజనుకు రూ.332, పాలు లీటరుకు రూ.224గా ఉంది. ఇక కిలో టమాట రూ. 150గా ఉంది. వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ముందు ఈ ధరలు ప్రస్తుతానితో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ క్షణంలో అయిన భారత్‌తో యుద్ధం ప్రారంభం కావొచ్చన్న ఊహాగానలతో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోయింది.
ఆరోగ్య సంక్షోభం దిశగా
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌పై ఇప్పటివరకు ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం, అలాగే భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులను వెళ్లిపోవాలని చెప్పడం వంటివి పాక్‌కు ప్రధానంగా దెబ్బకొట్టే అంశాలు. తాజాగా పాక్ నుంచి వచ్చే దిగుమతి వస్తువులపై కూడా నిషేధం విధించింది. అలాగే ఆ దేశానికి ఎగుమతి చేసే ఔషధాలపై కూడా బ్యాన్ వేసింది. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న పాక్ ఆరోగ్య రంగం మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనుంది.
Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
ఇలాంటి ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ భారత్‌తో యుద్ధం చేయలగలదా అనేది ఇప్పుడు ప్రశ్న. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి మందికి పైగా పాకిస్థానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్థాన్ పరిస్థితి ఇంకా దారుణమైన పరిస్థితికి దిగజారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ అక్కడి షెహబాజ్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది.
ప్రజల దృష్టి మార్చేందుకేనా ?
అయితే దీనిపై ప్రజల దృష్టి మరల్చేందుకే పాక్ ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిందని పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాకిస్థాన్ ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో కూడా యుద్ధానికి దిగితే ఆ దేశ పరిస్థితి ఇంకా తీవ్రంగా పతనమవుతుందని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ ముందుగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Also Read : పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?
rtv-news | telugu-news | india-pakistan | india pakistan border tensions | pakistan economy | major issues in pakistan economy