Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

కాంగ్రెస్ MLAల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల వారి శాఖలపై ఆరోపణలు వచ్చినా స్పందించలేదని నిలదీశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై MLAలు మౌనంగా ఉండటమేంటని సీఎం ఫైర్ అయ్యారు. అన్నీ తానే మాట్లాడాలంటే అది మంచిది కాదన్నారు.

New Update
Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చాలా కోపంగా ఉన్నారు. మంత్రులు, ముఖ్య నేతలకు ఒకటే క్లాసు పీకుతున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. ఇప్పుడు తమపైనా సీరియస్‌ అవతుండటంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు షాక్‌ అవుతున్నారు. కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇకపై సీరియస్‌గా పని చేయాలని వార్నింగ్ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో విస్తృత చర్చకు జరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమేంటని సీఎం ఫైర్ అయ్యారు.

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Also Read: Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

MLAపై ఆగ్రహం..

ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని MLAపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్నే తానే మీడియా ద్వారా మాట్లాడటం మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నియోజవర్గాల్లో సమస్యలను తెలుసుకోవాలని.. కొంతమంది MLAలు హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం రేవంత్‌రెడ్డి.

Also Read: Hyderabad: జూబ్లీహిల్స్‌లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు

కొందరు మంత్రుల వారి శాఖలపై ఆరోపణలు వచ్చినా కూడా స్పందించకపోవడమేంటని సీఎం నిలదీశారట. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాదులోనే మకాం వేసి టైం పాస్ చేస్తున్నారట. అలా టైంపాస్ చేసేవారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని పార్టీ శ్రేణులు అంటున్నారు. అయినా కూడా చాలామంది పద్ధతి మార్చుకోకపోవడంతో పార్టీకి ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిందని ముఖ్యమంత్రి అంటున్నారు. బీఆర్ఎస్, బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ సోషల్ మీడియాలో చాలా వెనుకబడి ఉందన్నారు. ఇక నుంచి అవసరాన్ని బట్టి అందరూ మాట్లాడాల్సిందేనని సీఎం ఆదేశించారట. ఎవరు ఏం చేస్తున్నారో తనకి తెలుసని, తమని కాదన్నట్లుగా ఎవరైనా ఉంటే వారిని ఏం చేయాలో కూడా తెలుసని CM వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

(chief-minister-revanth-reddy | congress-mla | congress | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు