Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ వాహనాలపై 17,391 ట్రాఫిక్ కేసులు పెండింగ్ ఉన్నట్లు RTIలో తేలింది. HYD ట్రాఫిక్‌మెన్‌ లోకేంద్ర సింగ్ రూ.68 లక్షల చలాన్లు ఉన్నట్లు Xలో వెల్లడించాడు. ఆ పోస్ట్ వైరలై రూల్స్ మాకేనా.. మీకు లేవా అని నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
HYD Traffic Man

Pending Traffic Challan

Pending Traffic Challan: హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్దామంటే.. ఎక్కడ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేస్తాడేమో అని భయపడే వాళ్లు ప్రశ్నించే సమయం వచ్చింది. రోజంతా కష్టపడి పని చేసిన డబ్బు..  ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే అక్కడే అయిపోతాయి. సామాన్యులపై కొరడా ఝులిపించే ట్రాఫిక్ పోలీసులు.. ప్రభుత్వ వాహనాలపై ఉన్న ఫైన్లు ఎందుకు వసూళ్లు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు పోలీసులు అడ్డగోలుగా రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్‌‌‌‌ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్‌‌‌‌ తమకు వర్తించవు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. 

Also Read: Hyderabad: జూబ్లీహిల్స్‌లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు

Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

పోలీస్‌‌‌‌ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

డీజీపీ పేరు మీద ఉన్న పోలీస్‌‌‌‌ వాహనాలపై ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు 17,391 కేసులు నమోదు అయ్యాయి. ఆ పెండింగ్ కేసుల చలాన్ విలువ మొత్తం.. రూ.68 లక్షల 67 వేల 885. పోలీస్ శాఖ దీన్ని  చెల్లించాల్సి ఉంది. ఈ వివరాలను హైదరాబాద్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌మెన్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న లోకేంద్రసింగ్‌‌‌‌ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించాడు. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదంటూ తన ఎక్స్‌‌‌‌అకౌంట్‌‌లో పోస్ట్ చేశాడు. సోషల్​ మీడియాలో లోకేంద్ర సింగ్​ పోస్ట్​ వైరల్ కావడంతో  అధికారులు అలర్ట్​ అయ్యారు. 

Also Read: INDIA PAK WAR: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్

సోషల్ మీడియా వేధికగా లోకేంద్ర సింగ్ పోలీసులను ప్రశ్నించారు. నేను ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తాను. దయచేసి పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరోధించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నానని లోకేంద్రసింగ్‌‌‌‌ ట్వీట్​ చేశారు. లోకేంద్రసింగ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ చేసిన ట్వీట్‌‌‌‌పై నెటిజన్లు కామెంట్లతో విరుచుకు పడుతున్నారు. లోకేంద్రసింగ్‌ను పలువురు మెచ్చుకుంటున్నారు.

(telangana-police-department | hyderabad-traffic | hyderabad-traffic-alert | hyderabad-traffic-restrictions | police-vehicle | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు