🔴India-Pak LIVE Updates : మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం.. వార్ పై ప్రకటన!

జమ్మూ కశ్మీర్‌లో రాత్రిపూట కాల్పుల విరమణ ఉల్లంఘనలు, డ్రోన్లు సంభవించలేదని, మే 7 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ప్రశాంతమైన రాత్రిగా ఇది మారిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

author-image
By Krishna
New Update
India-Pak Tensions

India-Pak Tensions


జమ్మూ కశ్మీర్‌లో రాత్రిపూట కాల్పుల విరమణ ఉల్లంఘనలు, డ్రోన్లు సంభవించలేదని, మే 7 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ప్రశాంతమైన రాత్రిగా ఇది మారిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

  • May 12, 2025 21:36 IST

    ఆపరేషన్ సిందూర్‌ విజయం.. బీజేపీ సంచలన నిర్ణయం

    ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్‌ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది.

    BJP to organise 'Tiranga Yatra' following success of Operation Sindoor
    BJP to organise 'Tiranga Yatra' following success of Operation Sindoor

     



  • May 12, 2025 21:24 IST

    Operation sindoor : పాకిస్థాన్‌ లోని కిరాణా హిల్స్ తెలుసా? అక్కడ ఏముందంటే?

    తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్‌లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ లోని కిరాణాహిల్స్‌ అంశం తెరమీదకు వచ్చింది.

    Kirana Hills in Pakistan
    Kirana Hills in Pakistan

     



  • May 12, 2025 20:51 IST

    పాక్‌కు ప్రధాని మోదీ పవర్‌ ఫుల్‌ వార్నింగ్‌

    - అణు బ్లాక్‌మెయిల్‌ను భారత్‌ సహించదు
    - భయంతోనే పాక్‌ ప్రపంచదేశాలను ఆశ్రయించింది
    - ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.
    - భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్‌
    - 3రోజుల్లో పాక్‌కు ఊహకందని విధంగా దాడి చేశాం
    - ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు
    - యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం
    - ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం
    - అణ్వాయుధాల బ్లాక్‌ మెయిల్‌ను ఇక సహించేది లేదు
    - పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది



  • May 12, 2025 20:42 IST

    ఈ రోజు బుద్ధ పూర్ణిమ..

    బుద్ధుడు మనకు శాంతిమార్గాన్ని చూపాడు.. అదే మనకు ఆదర్శం.. త్రివిధ దళాలకు తలవంచి నమస్కరిస్తున్నాను.. భారత్‌ మాతాకీ జై-ప్రధాని నరేంద్ర మోడీ



  • May 12, 2025 20:27 IST

    అలా చేస్తే పాక్‌ ఉండదు.. ప్రధాని మోదీ సంచలన వార్నింగ్



  • May 12, 2025 20:23 IST

    పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

    ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు.  



  • May 12, 2025 20:15 IST

    PM Modi - Address To The Nation



  • May 12, 2025 20:14 IST

    PM Modi: ఉగ్రవాదులను మట్టిలో కలిపాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

    ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు.  

    PM Modi
    PM Modi

     



  • May 12, 2025 19:46 IST

    భారత్-పాక్ మధ్య న్యూక్లీయర్ యుద్ధాన్ని ఆపాను: ట్రంప్



  • May 12, 2025 19:08 IST

    ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!

    ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.

    PM Modi
    PM Modi

     



  • May 12, 2025 19:07 IST

    ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

    operation sindoor : కాల్పులవిరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్‌-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి దీనిలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చించారు.

     



  • May 12, 2025 18:42 IST

    పాకిస్తాన్ మంత్రులకు చెమటలు పట్టించిన టీవీ యాంకర్.. ఏం జరిగిందంటే?

    స్కై న్యూస్ ఛానల్ యాంకర్ పాకిస్తాన్‌లో ఉగ్రవాదం గురించి ఆ దేశ మంత్రులను నిలదీసింది. యాల్డా హకీమ్ ఇంటర్వ్యూలో పాక్ సమాచార మంత్రి ఉగ్రవాద శిభిరాలు లేవని చెప్పాడు. దీంతో ఆమె పాక్ రక్షణ మంత్రి చెప్పిన మాటలు గుర్తు చేశారు.

    anchor pak ministers

     



  • May 12, 2025 18:17 IST

    వార్ వీడియోలను విడుదల చేసిన ఆర్మీ



  • May 12, 2025 17:55 IST

    ముగిసిన భారత్, పాక్ DGMOల మీటింగ్



  • May 12, 2025 17:47 IST

    హైదరాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ ఇందిరా గాంధీని గుర్తుచేస్తోంది

    నాడు ఇందిరా గాంధీని ప్రపంచం మెచ్చుకుంది.. ఇందిరా కూడా ప్రతిపక్షంతో విమర్శలు లేకుండా యుద్ధం చేశారు.. అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసింది.. యుద్ధంలో తలదూర్చొద్దని అప్పట్లో అమెరికాను ఇందిరమ్మ హెచ్చరించారు.. తప్పని పరిస్థితిలో అప్పటి పాక్‌ ప్రధాని తలవంచారు.. ఇందిరాగాంధీని వాజ్‌పేయి అపరకాళీ అని ప్రశంసించారు-జగ్గారెడ్డి



  • May 12, 2025 17:41 IST

    Ind Pak War: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!

    ‘ఆపరేషన్ సిందూర్‌’తో శత్రువును గాల్లోనే దెబ్బకొట్టామంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. పాక్‌కు చెందిన మిరాజ్‌ ఫైటర్ జెట్‌ను గాల్లోనే కూల్చివేసినట్లు అందులో పేర్కొంది. మిరాజ్‌ శకలాలు వీడియోలో కనిపించాయి.

    operation sindoor videos

     

     

     



  • May 12, 2025 17:32 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు

    ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు అక్కడి తల్లిదండ్రులు సిందూర్ అని పేరు పెట్టారు.

    17 New Born Girls Named 'Sindoor' In UP After Indian Army's Operation Sindoor
    17 New Born Girls Named 'Sindoor' In UP After Indian Army's Operation Sindoor

     



  • May 12, 2025 17:21 IST

    ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడులు.. పాకిస్తాన్‌ ఆర్మీని ఎలా దెబ్బకొట్టాయంటే..?

    ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ని అన్ని విధాల దెబ్బ కొట్టింది. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన టెర్రర్ సంస్థలను భారత్ అనుకుంటే నాశనం చేయగలదని ఇండియన్ ఎయర్ ఫోర్స్ నిరూపించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారత్ వ్యూహాత్మక విధానం.

    Operation Sindoor
    Operation Sindoor

     



  • May 12, 2025 17:04 IST

    Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో రిలీజ్‌ చేసిన ఇండియన్ ఆర్మీ

    ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అందులో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    The Pakistani Mirage, India Says Destroyed Enemy In The Sky
    The Pakistani Mirage, India Says Destroyed Enemy In The Sky

     



  • May 12, 2025 17:04 IST

    Balochistan: పాక్ కు పక్కలో బల్లెంలా బలుచిస్తాన్.. వారి డిమాండ్లు ఏంటి? ఫుల్ హిస్టరీ ఇదే!

    మొదట ఇష్టం లేకున్నా తర్వాత 1948 మార్చి 27 బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ దేశంలో కలుపుకున్నారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలని పోరాడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు దోపిడి గురవుతున్నాయని బలూచ్ తెగ ఉద్యమించింది.

    Read More



  • May 12, 2025 16:26 IST

    ANI



  • May 12, 2025 16:21 IST

    జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

    ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

    PM Modi
    PM Modi

     



  • May 12, 2025 15:24 IST

    సాయంత్రానికి వాయిదా పడ్డ DGMOల సమావేశం



  • May 12, 2025 15:24 IST

    India vs Pakistan: DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

    భారత్‌-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.

    India Pak War Updates🔴LIVE : ముగ్గుర్నిఅప్పగిస్తేనే.! | PM Modi Conditions | Ceasefire | Trump | RTV



  • May 12, 2025 15:05 IST

    ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు..

    సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్‌ చేస్తున్నారు.. 9, 10 తేదీల్లో పాక్‌ మన వైమానిక స్థావరాలను టార్గెట్‌ చేసింది.. కానీ, మన డిఫెన్స్‌ వ్యవవస్థతో వాటిని అడ్డుకున్నాం.. మల్టీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను దాటుకొని పాక్‌ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయింది-డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి



  • May 12, 2025 14:57 IST

    పాకిస్తాన్ లో భారీ భూకంపం!

    ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్‌ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఆ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలుస్తోంది.



  • May 12, 2025 14:56 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన..

    ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తే పాక్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోందని విమర్శించారు.

    Indian Army pressmeet



  • May 12, 2025 13:33 IST

    S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కలిసి తయారు చేద్దాం-- భారత్ కు రష్యా ప్రతిపాదన



  • May 12, 2025 13:33 IST

    ప్రధాని మోదీ నివాసంలో ప్రారంభమైన హైలెవల్ మీటింగ్



  • May 12, 2025 13:08 IST

     32 విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు AAI అనుమతి


    భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణతో మూతపడ్డ ఎయిర్‌పోర్ట్‌లు
    ఉద్రికత్తలకు తెరపడటంతో కార్యకలపాలు పునఃప్రారంభం.



  • May 12, 2025 13:07 IST

    భారత్, పాక్‌ మధ్య చర్చలు


    హాట్‌లైన్‌లో భారత్, పాక్‌ డీజీఎంవోల చర్చలు
    సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గింపు, పీవోకేపై చర్చలు



  • May 12, 2025 10:40 IST

     జైసల్మేర్‌-పాక్‌ బోర్డర్‌లో రాజస్థాన్‌ మంత్రుల పర్యటన. 


    పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన. 
    గత ఆరు రోజులుగా టెన్షన్‌ టెన్షన్‌. 
    బాంబుల మోత నుంచి ప్రశాంత వాతావరణంలోకి ఎల్‌ఓసీ ప్రాంతాలు. 
    ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు.



  • May 12, 2025 07:13 IST

    కాల్పుల విరమణపై నేడు చర్చలు

    అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని మే 10న పిలుపునిచ్చిన సమయంలో ఇరు దేశాలు కుదుర్చుకున్న కాల్పుల విరమణ "అవగాహన"పై చర్చించడానికి భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరపనున్నారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు