/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)
PM Modi
గతకొన్ని రోజులుగా ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే మొదటి సారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ఆరోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని ఏం మాట్లాడనున్నారని ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాల గురించి మోదీ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమితి కశ్మీర్ ను ఇండియాకు అప్పగించాలని మోదీ ఇటీవల అన్నారు. ఇదే విషయంపై ఆయన పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసీ వెంట కాల్పులకు తెగబడింది. దీంతో ప్రధాని సీరియస్ అయ్యారు.
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
భవిష్యత్‌లో ఏ దేశమైనా భాతర్‌పై ఉగ్రదాడి, కాల్పులకు పాల్పడితే అది యుద్ధ చర్యగానే భావిస్తామని హెచ్చరించారు. అయితే ఇదే అంశంపై చైనాకు కూడా మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు.. జాతి సమగ్రత, ఐక్యత గురించి నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. ఇలాంటి సమయంలో భారతీయులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునివ్వనున్నారు.
పాకిస్తాన్‌పై భారత్ తదుపతి వైఖరిని కూడా మోదీ తెలపనున్నారు. ఆపరేషన్ సిందూర్ కూడా ఇంకా అయిపోలేదని ఆయన చెప్పారు. దీంతో ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ తర్వాత దాడులు ఎలా ఉంటాయో ఆయన వివరించనున్నారు. ఉగ్రవాదంపై భారత్ యాక్షన్, పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్‌ను భారత‌్‌కు అప్పగించాలని మోదీ ఇటీవల అన్నారు. దీంతో ఈ తరహాలు ఏమైనా భారత్ డిమాండ్లు ఉండనున్నాయా అని చూడాలి.
(pm modi | india pak war | operation Sindoor | pakistan | india | latest-telugu-news)