Ind Pak War: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!

‘ఆపరేషన్ సిందూర్‌’తో శత్రువును గాల్లోనే దెబ్బకొట్టామంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. పాక్‌కు చెందిన మిరాజ్‌ ఫైటర్ జెట్‌ను గాల్లోనే కూల్చివేసినట్లు అందులో పేర్కొంది. మిరాజ్‌ శకలాలు వీడియోలో కనిపించాయి.

New Update
operation sindoor videos

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాదాపు 9 టెర్రర్ క్యాంపులపై దాడులు చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. అనంతరం భారత్‌పై పాక్ దాడులకు ప్రయత్నించింది. కానీ వాటిని ఇండియన్ ఆర్మీ గాల్లోనే ధ్వంసం చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్ బాంబులు, క్షిపణులను గాల్లోనే నాశనం చేసేశాయి. 

Also Read :  ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

Ind Pak War 2025

దీంతో వాటికి సంబంధించిన ఏరియల్ వ్యూ వీడియోలను ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది. తాజాగా మరొక వీడియో షేర్ చేసింది. పాకిస్తాన్ స్థావరాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేసిన తీరును ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు పాక్‌కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు వీడియో వదిలింది. ఆ వీడియోలో మిరాజ్ శకలాలు క్లియర్‌గా కనిపించాయి. అదే సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడుల అనంతరం భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్యను ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు

Also Read :  జియో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. తక్కువ ధరకే 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

Also Read :  విరాట్ కోహ్లీ సంపద​ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఇన్ని కోట్లా భయ్యా!

operation Sindoor | ind pak war | ind pak war updates | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు