India vs Pakistan: DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

భారత్‌-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update

భారత్‌-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం  DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్‌ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్‌,హఫీజ్, దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. అలాగే  POKను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్‌ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.  

Also Read: ఉగ్రవాదుల కొత్త వ్యూహాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్‌ డిమాండ్లు పరిశీలిస్తే.. ''సింధూ జలాలను వెంటనే విడుదల చేయాలి, ఆపరేషన్ సిందూర్‌ను ఆపివేయాలి, పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌ను నిందించొద్దు. మా పౌరులను చంపామని భారత్‌ ఒప్పుకోవాలనే'' డిమాండ్లు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇరుదేశాలు ఇంకా ఇతర అంశాలపై కూడా ఓ ఒప్పందానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. మరి ఇది కొనసాగుతుందా ? లేదా ? అనేది చర్చల తర్వాత తెలియనుంది. ఇరుదేశాల మధ్య జరగనున్న ఈ చర్చలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Also Read: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు