Joint Military Briefing on Operation Sindoor, Know Details
ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ''ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోంది. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. కానీ పాకిస్థాన్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోంది. పాక్ వివిధ రకాల డ్రోన్లతో భారత్‌పై దాడులకు యత్నించింది. అలాగే చైనా తయారు చేసిన పీఎల్-15 మిసైళ్లతో కూడా పాక్ దాడులు చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో వాటిని అడ్డుకున్నాం. మా యుద్ధం పాకిస్థాన్ సేనతో కాదు, ఉగ్రవాదులతోనే.
Also Read: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు. సైనికులనే కాకుండా.. యాత్రికులు, భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మే 9,10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావారాలను టార్గెట్ చేసింది. మేము ముందుగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశాం. అత్యాధునిక రాడర్లతో మనకు నిఘా వ్యవస్థ ఉంది. రాత్రి, పగలు పనిచేయగల సామర్థ్యం మన పైలట్లకు ఉంది. నౌకదళంపరంగా కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని'' తెలిపారు.
Indian Army | india-pakistan | pakistan | rtv-news | telugu-news