BJP: ఆపరేషన్ సిందూర్‌ విజయం.. బీజేపీ సంచలన నిర్ణయం

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్‌ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది.

New Update
BJP to organise 'Tiranga Yatra' following success of Operation Sindoor

BJP to organise 'Tiranga Yatra' following success of Operation Sindoor

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది.  మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్‌ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది. ప్రధాని మోదీ నాయకత్వం, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఈ ప్రచారం దేశవ్యాప్తంగా కొనసాగనుంది. 

Also Read: అలా చేస్తే పాక్‌ అంతమే.. ప్రధాని మోదీ సంచలన వార్నింగ్

ఈ తిరంగా యాత్ర నిర్వహణపై చర్చించేందుకు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఆదివారం సమావేశం నిర్వహించారు. సోమవారం కూడా తరుణ్ చుగ్‌, వినోద్‌ తావ్డే తదితరలు సమావేశమై దీనిపై కసరత్తు పూర్తి చేశారు. అయితే ఈ క్యాంపెయిన్‌లో పలువులు ప్రముఖులతో పాటు ప్రజలను సమీకరించనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. అలాగే ఈ యాత్రలో పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. 

Also Read: పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!

 మరోవైపు ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇకనుంచి ఇదే తరహాలో స్పందిస్తాని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్‌ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. 

Also Read: ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

Also Read: పాకిస్తాన్ మంత్రులకు చెమటలు పట్టించిన టీవీ యాంకర్.. ఏం జరిగిందంటే?

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు