/rtv/media/media_files/2025/05/12/8HEMl7l8tsJWBEhiSnjT.jpg)
The Pakistani Mirage, India Says Destroyed Enemy In The Sky
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన మరో వీడియోను సైన్యం విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు చెప్పింది. ఆకాశంలో శత్రువును ధ్వంసం చేయు అనే క్యాప్షన్‌ను పెట్టింది. ఈ వీడియోలో పాక్ మిరాజ్ యుద్ధ విమాన శిథిలాలను కూడా చూపించించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే ఎన్ని లక్షల కోట్లంటే?
India Says Destroyed Enemy In The Sky
आकाशे शत्रुन् जहि I
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 12, 2025
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
Also Read: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?
ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ''ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోంది. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. కానీ పాకిస్థాన్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోంది. పాక్ వివిధ రకాల డ్రోన్లతో భారత్‌పై దాడులకు యత్నించింది. అలాగే చైనా తయారు చేసిన పీఎల్-15 మిసైళ్లతో కూడా పాక్ దాడులు చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో వాటిని అడ్డుకున్నాం. మా యుద్ధం పాకిస్థాన్ సేనతో కాదు, ఉగ్రవాదులతోనే.
Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు. సైనికులనే కాకుండా.. యాత్రికులు, భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మే 9,10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావారాలను టార్గెట్ చేసింది. మేము ముందుగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశాం. అత్యాధునిక రాడర్లతో మనకు నిఘా వ్యవస్థ ఉంది. రాత్రి, పగలు పనిచేయగల సామర్థ్యం మన పైలట్లకు ఉంది. నౌకదళంపరంగా కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని'' తెలిపారు.
Also Read : పాకిస్తాన్ మంత్రులకు చెమటలు పట్టించిన టీవీ యాంకర్.. ఏం జరిగిందంటే?
telugu-news | national-news