TTD: తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్!
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు చేసిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. వెంకట సాయి వర్మ, రామాంజనేయులు, షేక్ మహబూబ్ భాషాపేను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం వల్ల పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ తో పాటు మరో మావోయిస్టు హతమయ్యారు.
ఏపీలోని వైజాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల క్రితం మ్యారేజ్ అయిన కొత్త జంట సాయినాగేంద్ర, శాలిని ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ చిరుద్యోగులు. హాస్పిటల్లో పనిచేస్తూ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కానీ ఇంతలోనే మృతి చెందారు.
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.