Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాాలని వెల్లడించింది.

New Update
Rains

Rains

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మత్స్య కారులు జాగ్రత్తగా ఉండాలని వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

ఏపీలో ఈ జిల్లాల్లో..

నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Advertisment
Advertisment
తాజా కథనాలు