/rtv/media/media_files/2025/06/30/ttd-htl-2025-06-30-18-01-05.jpg)
TTD Hotel: తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపారాలకు వాడుకుంటున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు
జయ, విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మెడ, కులశేఖర పడితో కూడిన నమూనాలను తీర్చి దిద్దారు. దీనిపై టీటీడీ ఈఓ, చైర్మెన్ కు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే హోటల్ వద్ద ఆందోళన చేపడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.