Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

New Update
weather Updates

Weather Update

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..

గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వాతావరణమంతా మారిపోయింది. మొత్తం మేఘాలు ఆకాశాన్ని కుమ్మేశాయి.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

మరికొన్ని గంటల్లో భారీగా వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అమీన్ పూర్, బీరంగూడ, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, ప్రగతి నగర్, కుత్బుల్లాపూర్, అల్వార్ వంటి కొన్ని ఏరియాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు