BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) ఒక చారిత్రక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.
విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు రూ.8 లక్షలకు కిడ్నీ ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.
వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా కొర్లాంకు చెందిన సంపత్ కుమార్ (31)గా గుర్తించారు.
విశాఖలో దొంగపోలీస్, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.