/rtv/media/media_files/2025/06/16/fpkyJJOnCuSC4BWA7ets.jpg)
east godavari married couple killed in road accident at vizag
అమ్మాయి అబ్బాయి.. ఇద్దరూ హాస్పిటల్‌లో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమను మరికాస్త ముందుకు తీసుకెళ్లి పెళ్లిగా మలిచి నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు గన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఏ రోజు ఇద్దరి మధ్య మనస్పర్థాలు రాకుండా ప్రేమించుకున్నారు. ఇరువురు తమ ఫ్యామిలీని ఒప్పించి గత నెలలో పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఏళ్లకల నెరవేరింది. కానీ ఇంతలోనే మృత్యువు వారిద్దరినీ కాటేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ప్రేమ గెలిచింది ప్రాణం పోయింది
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరికి చెందిన జొన్నాడ వెంకన్న, బేబీ దంపతుల పెద్ద కుమారుడు సాయినాగేంద్ర(27) గాజువాకలోని హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. విశాఖ జిల్లా గంగవరానికి చెందిన శాలిని (25) కూడా అదే హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తుంది. ఇద్దరూ మూడేళ్లుగా అందులోనే పనిచేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
అలా పెళ్లి బంధంతో ఒక్కటవ్వాని అనుకున్నారు. ఇద్దరూ తమ పేరెంట్స్‌ను ఒప్పించారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో మే 11న కాకినాడలోని కొమరగిరిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారం క్రితమే మళ్లీ గాజువాక వచ్చి కాపురం పెట్టారు. ఇలా ఇద్దరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ సరదా సరదాగా జీవించారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. శనివారం అతని బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం ఆర్కే బీచ్‌కు వెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. దీంతో బైక్‌పై వెళ్తుండగా.. షీలానగర్-కాన్వెంటు మార్గంలో నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయినాగేంద్ర స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. శాలిని తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటనతో ఇరు ఫ్యామిలీ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య