Chandrababu Naidu : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. కొండచరియలు విరిగిపడే అవకాశాలు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు.