AP: విజయవాడలో మళ్లీ వర్షం.. వరద భయంతో వణుకుతున్న ప్రజలు!
విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో గంట నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే సింగ్‌నగర్, చిట్టినగర్, రెడ్డికాలనీ, ఊర్మిళనగర్ కాలనీల్లో వరద పోకముందే వర్షం పడడంతో కాలనీ వాసుల్లో ఆందోళన మొదలైంది. బెజవాడ వాసులకు జడివాన కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.