/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
telangana rain update
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షం, మరో వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. తెల్లవారి ఎండ .. సాయంత్రానికి మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఉదయం పూట ఎండ వీపు వాయించేస్తుంది.. సాయంత్ర అయ్యే సరికి వరుణుడు వర్షంతో ఉపశమనం కలిగిస్తున్నాడు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం తరచూ ఉరుములు, మెరుపులతో వానలు జోరుగా కురుస్తున్నాయి.
@balaji25_t Nalgonda District Damera Beemanapally Smashing rain with powerful Winds pic.twitter.com/nIgF47dNGk
— kirrak street food (@KirakStreetfood) June 7, 2025
Telangana Rain Update
దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రెండు మూడు రోజులుగా ఇదే జరుగుతోంది. ఇవాళైన వరుణుడు తగ్గుతాడు అనుకుంటే మరింత విజృంభిస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, మెరుపు, ఉరుములతో కూడిన వర్షం దంచికొడుతుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
@balaji25_t smashing rain at mall pic.twitter.com/Ku32xRUj2c
— harsha (@harshach93) June 7, 2025
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
రంగారెడ్డి (యాచారం, మంచాల్, మాడగుల్, షాద్‌నగర్), నల్గొండ (చండూరు, దేవరకొండ), వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, జంగాన్, నాగర్‌కర్నూల్‌లోని కొన్ని ప్రాంతాలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అలాగే మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రంగారెడ్డిలో ఈదురు గాలులతో వర్షం పడుతోంది. రానున్న 2గంటల పాటు ఇవి కొనసాగనున్నాయి.
HyderabadRains ALERT ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) June 7, 2025
Scattered INTENSE STORMS ahead in marked areas next 1-2hrs, plan accordingly ⚠️⛈️ pic.twitter.com/ln9wn5qvzx
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు స్థానికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
telangana-rain | hyd-rain | telangana rains latest news | telangana weather updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | cool-weather