/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
తెలంగాణలో నేటి నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు అంటే ఆదివారం వరకు వర్షాలు విస్తారంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకూ ఉన్న ద్రోణి, చత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుపాను ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 3 వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు.
Also Read: Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు!
నేటి నుంచి ఆదివారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశారు.ఏప్రిల్ 3, 4 తేదీల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, , వనపర్తి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana Weather Orange Alert
నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ పరిసరాల్లో గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు బయట తిరగడం తగ్గించి, ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.
గురువారం గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్లుగా ఉంటుందని.. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షం పడే ముందు గాలి వేగం పెరుగుతుందని చెప్పారు. ఉష్ణోగ్రత తెలంగాణలో 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపారు. తేమ పగటివేళ 40 శాతం ఉంటుందని.. రాత్రివేళ 80 శాతం దాటుతుందని అన్నారు. దీంతో తీవ్ర ఉక్కపోత తగ్గుతుందని చెప్పారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు దంచికొడుతుండగా.. వాతావరణ మార్పులతో ప్రజలకు ఉపశమనం దొరుకుతుంది. అయితే వగడళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!
Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
telangana | mahabubnagar | adilabad | rains | weather | telangana-weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates