Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్‌ సుంకాల పై వివిధ దేశాధినేతలు!

ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ పేర్కొన్నారు.ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని..అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ పేర్కొన్నారు.

Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

ఆస్ట్రేలియా దిగుమతుల పై ట్రంప్ 10 శాతం సుంకం ప్రకటించారు.దీని పై ఆల్బనీస్‌ మాట్లాడుతూ..ఇది నిజమైన స్నేహితుడు చేసే చర్య కాదు. ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవి. ట్రంప్‌ టారిఫ్‌ చర్యలకు అమెరికన్‌ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆయన పేర్కొన్నారు.

Also Read:  Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం ట్రంప్‌ సుంకాల పై స్పందిస్తూ..ఈయూ దిగుమతుల పై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదన్నారు. దీని పై యూఎస్‌ తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాము వాణిజ్య యుద్ధం కోరుకోవడం లేదని , యూఎస్‌ తో కలిసి టారిఫ్‌ లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌ పేర్కొన్నారు. ఇది ఇరుదేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తుందన్నారు.

అమెరికా ఇప్పటికే కెనడా దిగుమతుల పై 25 శాతం సుంకం వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తాజా ప్రకటన పై ఆ దేశ నూతన ప్రధాని మార్క్‌ కార్నీ స్పందించారు. ట్రంప్‌ భారీ సుంకాలకు వ్యతిరేకంగా పోరాడతామని, ప్రతీకార సుంకాలు తాము విధిస్తామని ఆయన ప్రతిజ్ఙ చేశారు.

అమెరికా అధ్యక్షుడి చర్య మిలియన్ల మంది కెనడియన్ల పై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదని బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. టారిఫ్‌ లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

జర్మనీ, స్పానిష్‌ తో సహా ఇతర దేశాలు సైతం ఇదేవిధంగా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. ట్రంప్‌ టారిఫ్‌ లను తట్టుకునేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం బుధవార ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది.అయితే అమెరికా అధ్యక్షుడి ప్రకటన పై అక్కడి ప్రధాని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read: Juveniles Escape:గేట్లు, సీసీ టీవీలు పగులగొట్టి మరీ జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్న 21 మంది బాల నేరస్థులు...!

Also Read: Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!

trump | trump tariffs | trump tariffs on india | australia | italy | italy-pm | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు