Jadcherla : కోడి పోయిందని పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలం లాల్కోట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప కళేబరం కనిపించింది. పప్పులో చనిపోయిన కప్పని చూసి విద్యార్థులు భోజనం చేయకుండా వెనుదిరిగారు. విషయంపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన దారుణ ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకుంది. తాతా ఆస్తి దస్తాల కోసం రెవెన్యూ అధికారి లంచం అడగడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపేందుకు కూడా భార్యలు వెనుకడాటం లేదు. సమాజంలో ఇలాంటి తరహా ఘటనలే ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య.
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు హెచ్చరించారు.
'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు.
పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఓ నిండు గర్భిణి ప్రాణమే పోయింది. ఈ ఘటన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక చనిపోయినట్లుగా భర్త నరేందర్తో పాటు ఆమె బంధువులు ఆరోపించారు.