ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి 25 మంది!
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
మంచిర్యాలలో సంతూర్ సోప్లతో వెళ్తున్న ఒక లారీ ఇంకో లారీని ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారని కొందరు మండిపడుతున్నారు.
చిన్నారులపై అఘాయిత్యాల పట్ల షీ టీం వారిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అలా చేసిన ఒక ప్రయత్నంలో ఒక చిన్నారి లైంగికదాడికి గురైన విషయం వెలుగు చూసింది. ఓ పదేళ్ల చిన్నారికి డబ్బు, చాక్లెట్లు ఆశచూపి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకుంటున్న దళారుల ఆటకట్టించారు పోలీసులు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 16 బృందాలుగా విడిపోయి తొమ్మిది మండలాల్లో రైతుల వేషాలతో రంగంలోకి దిగారు. 34 మంది దళారులను అదుపులోకి తీసుకొన్నారు.
పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళళ్లాడు ఏఎస్ఐ.
భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆరు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.
కరెంట్ షాక్తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.