Heavy Rain : భారీ వర్షానికి మామ అల్లుడు గల్లంతు
మరోసారి హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి వర్షం దంచికొట్టింది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్లో ఇద్దరూ వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు.