Juveniles Escape:గేట్లు, సీసీ టీవీలు పగులగొట్టి మరీ జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్న 21 మంది బాల నేరస్థులు...!

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్‌ నుంచి సుమారు 21 మంది బాలనేరస్థులు బయటకు వచ్చేశారు. వారంతా గేట్లు దూకి,సీసీ కెమెరాలు పగలకొట్టి రచ్చ రచ్చ చేశారు. చేతిలో కర్రలతో హంగామా చేశారు.

New Update
jharkahand

jharkahand

నేరాలకు పాల్పడి ప్రస్తుతం జువైనల్ హోంలో ఉండి శిక్షను అనుభవిస్తున్న 21 మంది బాల బాలికలు అక్కడి నుంచి పారిపోయారు. ముఖ్యంగా వీరంతా ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. సీసీటీవీ కెమెరాలు పగులగొట్టి.. గేట్లను తోసుకుంటూ బయటకు వచ్చారు. గుంపులు గుంపులుగా రహదారిపైకి చేరి ఇష్టం వచ్చిన వైపుగా పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. 

Also Read:  Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!

అసలు ఈ చిన్న పిల్లలు ఎలా అలా చేయగలిగారంటూనే, అప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి అధికారులు వారిని పట్టుకున్నారా లేదా అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం పదండి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా నేర చరిత్ర కల్గిన మొత్తం 21 మంది బాలబాలికలు మంగళ వారం రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో తప్పించుకున్నారు. వీరంతా ఓ గుంపుగా మారి జువైనల్ హోంలోని సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. 

Also Read: Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

అలాగే గేటు బయటు ఇద్దరు అధికారులు ఉండగా.. లోపలి నుంచి గేట్లను బయటకు తోశారు. ఫలితంగా గేట్లు తెరుచుకోగా చిన్నారులంతా బయటకు వచ్చేశారు. ఆపై రోడ్డు మీద చేరి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చిన్నారుల వద్ద కర్రలు కూడా ఉండగా స్థానిక ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.మరోవైపు అక్కడే ఉన్న ఇద్దరు సిబ్బంది వారిని ఆపలేకపోయారు. ఇక చేసేదేమీ లేక వెంటనే పోలీసులు, పైఅధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. తప్పించుకున్న పిల్లల కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నలుగురు పిల్లలు దొరకగా.. మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే రోడ్డుపై వెళ్తున్న కొంత మంది పిల్లలు బయటకుపరుగులు పెడుతుండడం చూసి వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఇంత మంది ఖైదీలు ఉన్నప్పుడు.. అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని, వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి మాట్లాడుతూ.. మంగళ వారం రోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో దాదాపు 21 మంది పిల్లలు ఆందోళనకు దిగి ఆ వసతి గృహం నుండి బయటకు వెళ్లారని చెప్పారు. 

Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

Also Read: Earthquake in Japan : జపాన్ ను వణికించిన భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై ఎంతంటే...

jharkhand | juveniles | escape | escaped | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు