HCA Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు బిగ్ షాక్.. .సీఐడి విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.

New Update
HCA President Jagan Mohan Rao arrested by CBI

HCA President Jagan Mohan Rao arrested by CBI

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును  సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి కోర్టు లో పిటిషన్‌ వేయగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే అరెస్ట్‌ అయి చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను రేపు ఉదయం నుంచి జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతిచ్చింది. అదే సమయంలో విచారణ దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది.   

Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

Big Shock For Hyderabad Cricket Association

కాగా చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను రేపు ఉదయం జైలు నుంచి సీఐడీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. అనంతరం  సీఐడీ విచారణ ప్రారంభించనుంది. తద్వారా హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు. మొత్తంగా, హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు మరింత ఊపందుకోనుండగా.. నిందితులు సాగించిన ఆర్థిక లావాదేవీలపై మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్‌ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

hyderabad crime latest | Hyderabad Crime | telugu crime news | crime news | cid-officers | hyderabad-cricket-association | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు