BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.