HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ అడుగుపెట్టింది. హెచ్‌సీఏ పై పీఎంఎల్ఏ సెక్షన్ల కింద ఈడీ కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. HCA అధికారులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
HCA వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ అయింది. దీనిపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. HCA అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రమేయం ఇదివరకే ఉంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA)లో మరో కుంభకోణం బయటపడింది. సర్వసభ్య సమావేశానికి(AGM) ముందే 136 క్లబ్‌లకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం సంచలనం రేపుతోంది.
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏకు ఇస్తున్న ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాస్‌లు అమ్ముతున్నారని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలో జనరల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి శేష్‌నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.