/rtv/media/media_files/2025/07/16/warangal-news-2025-07-16-13-23-46.jpg)
Warangal News
ప్రేమ, అనుబంధం, త్యాగానికి ప్రతీకగా నిలిచే తోబుట్టువుల బంధం అపురూపమైనది. ముఖ్యంగా అన్న-చెల్లి సంబంధం మరింత ప్రత్యేకం. కష్టకాలంలో ఒకరి కోసం మరొకరు నిలిచే విధానం, ఆ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇలాంటి హృదయాన్ని హత్తుకునే సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన పదకొండేళ్ల బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని ఎముకమజ్జ సరిపడా రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది లక్షల మంది పిల్లల్లో ఆరుగురు నుంచి ఎనిమిది మందికి మాత్రమే ఈ వ్యాధి కలుగుతుంది. బాలుడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో అతని తల్లిదండ్రులు మే నెలలో కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం అతనికి సీవియర్ అప్లాస్టిక్ ఎనీమియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సలో భాగంగా మూలకణాల మార్పిడి తప్ప మరొక మార్గం లేదని తెలిపారు.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
చెల్లి త్యాగంతో అన్నకు ప్రాణం..
ఈ తరుణంలో పదేళ్ల చిన్నారి చెల్లి తన అన్నకు జీవితాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అన్నకు తన మూలకణాలు దానం చేయడంలో ఎలాంటి సంకోచం లేకుండా.. భయాన్ని పక్కన పెట్టి ముందడుగు వేసింది. నిజానికి తల్లిదండ్రులు, చిన్నారులూ ఇలాంటి శస్త్రచికిత్సలు గురించి వినగానే భయపడటం సహజం. కానీ ఈ బాలుడు మాత్రం తన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తాను త్వరగా బాగుపడతానని తల్లిదండ్రులను ఓదార్చడం వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది. చెల్లి ఇచ్చిన మూలకణాలు అన్నకు పూర్తిగా సరిపోలకపోయినా.. అర్థమ్యాచ్ అయినా సరే.. అంతర్జాతీయ నిపుణుల సూచనల ప్రకారం ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: డయాబెటిక్ రోగి ఉదయం ఏం తినాలో తెలుసా..? రక్తంలో చక్కెర నియంత్రణ కోసం..
సాధారణంగా ఇలాంటి చికిత్సల తర్వాత నోటిపూత, జుట్టు రాలడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ బాలుడు చూపిన ధైర్యం, చికిత్సకు సహకరించిన విధానం వల్ల అలాంటి సమస్యలు తలెత్తలేదు. వైద్యుల సమర్థత, చెల్లి చేసిన త్యాగం, బాలుడి ధైర్యం ముగింపుగా విజయాన్ని చేకూర్చాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి కూడా భారీగా రాయితీ ఇచ్చి చికిత్సను అందించింది. చివరకు బాలుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సంఘటన తోబుట్టువుల ప్రేమ ఎంత గొప్పదో తేల్చి చెప్పింది. చెల్లి చేసిన త్యాగం, అన్న ప్రాణాలను కాపాడిన ఘట్టం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒక్కొక్కసారి చిన్నారులే గొప్ప త్యాగాలకి ఉదాహరణలుగా మారతారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
ఇది కూడా చదవండి: కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి
Also Read : తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు
(warangal-news | warangal news today | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)